నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆఫీసరుకు కరోనా వైరస్..ఆఫీసుకు సీలు

ABN , First Publish Date - 2020-05-23T15:42:23+05:30 IST

ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) సాధారణ పాలనా శాఖ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా వైరస్ సోకింది.....

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆఫీసరుకు కరోనా వైరస్..ఆఫీసుకు సీలు

 న్యూఢిల్లీ : ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) సాధారణ పాలనా శాఖ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా వైరస్ సోకింది.ఎన్‌జీటీ  అధికారికి కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. కరోనా సోకిన అధికారితో కలిసి పనిచేసిన ఉద్యోగులను 14 రోజుల పాటు హోంక్వారంటైన్ చేశామని ఎన్జీటీ రిజిస్ట్రార్ జనరల్ ఆషుగార్గ్ చెప్పారు. శనివారం ఎన్జీటీ కార్యాలయానికి సీలు వేసి శానిటైజేషన్ చేయించామని ఎన్జీటీ అధికారులు చెప్పారు. ఎన్జీటీ ఉద్యోగులు, ఫిర్యాదుదారులు, న్యాయవాదులు  ఎన్జీటీ కార్యాలయంలో భౌతిక దూరంతోపాటు అన్ని నిబంధనలు పాటించాలని రిజిస్ట్రార్ జనరల్ కోరారు.

Updated Date - 2020-05-23T15:42:23+05:30 IST