కర్నూలు(లీగల్), ఏప్రిల్ 8: ఈ నెల 10న నిర్వహించాల్సిన జాతీయ లోక్ అదాలత్‌ను మే 8వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా జడ్జి డా.వి.రాధాకృష్ణ కృపాసాగర్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మే నెలలో జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు ఆ ప్రకటనలో కోరారు.