Abn logo
Jun 1 2021 @ 10:47AM

అనుమానాస్పద స్థితిలో జాతీయ ఛానెల్‌ విలేకరి మృతి

హైదరాబాద్ సిటీ/మదీన : అనుమానాస్పద స్థితిలో ఓ జాతీయ చానెల్‌ విలేకరి తన ఇంట్లోనే మృతిచెందాడు. ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పాతబస్తీ బండ్లగూడ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ రహ్మాన్‌ బావజీర్‌ (43) ఓ ఛానెల్‌ విలేకరిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఆయన భార్య, పిల్లలు బార్క్‌సలోని పుట్టింటికి వెళ్లగా ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. సాయంత్రం ఆయన స్నేహితులు ఫోన్‌ చేస్తే ఫొన్‌ లిఫ్ట్‌ చేయలేదు. దీంతో ఆయన సోదరుడికి, కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి చెప్పగా వారు ఇంటికి వెళ్లి చూశారు. తలుపులు వేసి ఉండడంతో బలవంతంగా తెరిచి చూడగా మంచంపై పడి మృతి చెంది ఉన్నాడు. దీంతో వారు చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. నిద్రలో గుండెపోటు వచ్చి చనిపోయాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనుమనాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.