Post Office Scheme: ఐదేళ్లలో రూ.6లక్షల వడ్డీ.. అదిరిపోయే స్కీం

ABN , First Publish Date - 2021-08-04T08:48:07+05:30 IST

డబ్బును పొదుపు చేయాలనుకునే వారు.. ఆ డబ్బును ఎక్కడ పెట్టుబడిగా పెడితే లాభాలు వస్తాయో అక్కడే పెట్టాలనుకుంటారు. అలాగే నమ్మదగిన వ్యవస్థలోనే..

Post Office Scheme: ఐదేళ్లలో రూ.6లక్షల వడ్డీ.. అదిరిపోయే స్కీం

డబ్బును పొదుపు చేయాలనుకునే వారు.. ఆ డబ్బును ఎక్కడ పెట్టుబడిగా పెడితే లాభాలు వస్తాయో అక్కడే పెట్టాలనుకుంటారు. అలాగే నమ్మదగిన వ్యవస్థలోనే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే మదుపరులకు ఈ రెండు సౌకర్యాలనూ పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్‌లోని అనేక స్కీమ్‌లు అధిక రిటర్న్స్ ఇవ్వడమే కాకుండా పటిష్ఠమైన నమ్మకాన్ని అందిస్తాయి. అలాంటి స్కీంలలోని ఒకటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్(ఎన్ఎస్‌సీ). అనేక బ్యాంకుల్లో ఫిక్స్‌‌డ్ డిపాజిట్‌ చేస్తే లభించే వడ్డీ రేటుకంటే ఎక్కువ వడ్డీ ఈ స్కీం ద్వారా మదుపరులకు లభిస్తుంది. ఈ స్కీం ప్రస్తుతం 6.8% శాతం వడ్డీ రేటును మదుపరులకు అందిస్తోంది.


నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీంలో కనీసం రూ.100 పొదుపు చేయాల్సి ఉంటుంది. రూ.100, రూ.500, రూ.1000, రూ.5000, రూ.10000 విలువ కలిగిన సర్టిఫికేట్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి ద్వారానే మన సొమ్ము పోస్ట్ ఆఫీస్‌లో పొదుపు చేయడం జరుగుతుంది. అయితే అత్యధికంగా పొదుపు ఎంత చేయాలని అనేదానిపై ఎలాంటి పరిమితి లేదు.  ఇక మెచ్యూరిటీ గడువు విషయానికి వస్తే.. ఇది 5ఏళ్లు వరకు ఉంటుంది.


ఈ స్కీంలో  ఒకవేళ ఎవరైనా ఈ స్కీంలో రూ.15లక్షలు పొదుపు చేస్తే వారికి 5ఏళ్లలో అక్షరాలా రూ.6లక్షల వడ్డీ లభిస్తుంది. అయితే ఎన్ఎస్‌సీలో డిపాజిట్ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీ ప్రతి ఏడాది అసలుకు జమ అవుతూ ఉంటుంది. నిర్ణయించుకున్న మెచ్యూరిటీ గడువు తరువాత అసలు, వడ్డీ మొత్తం మదుపరులకు లభిస్తుంది. ఒకవేళ మెచ్యూరిటీ గడువు ముగిసిన తరువాత గడువును పెంచుకోవాలని ముదుపరులు భావిస్తే మరో 5ఏళ్ల వరకు పెంచుకోవచ్చు.


టాక్స్ సేవింగ్: 

ఎన్ఎస్‌సీలో పొదుపు చేసిన మొత్తానికి ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. 1961 ఇన్‌కం టాక్స్ చట్టం, సెక్షన్ 80సీ ప్రకారం.. రూ.1.5 లక్షల వరకు పొదుపు చేసిన మొత్తంపై మదుపరులు ఎలాంటి పన్నులూ చెల్లించాల్సిన అవసరం లేదు. 

Updated Date - 2021-08-04T08:48:07+05:30 IST