Advertisement
Advertisement
Abn logo
Advertisement

జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటన‌లో మహిళా డీఎస్పీ కన్నీరు

గుంటూరు: హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు పరామర్శించారు. అయితే ఈ పర్యటనలో వైసీపీ నేతలను అనుమతించి తమను ఎందుకు అనుమతించరని పోలీసులపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో అధికార పార్టీ నేతలు జై జగన్ అనే నినాదాలు చేయడంపై కమలం నేతలు ప్రశ్నించారు. కాగా పర్యటనలో బందోబస్తుగా ఉన్న పోలీసులను తోసుకోని బీజేపీ నేతలు ముందుకెళ్లారు. కమలం నేతలను అడ్డుకునే సమయంలో ఓ మహిళా డీఎస్పీతో పాటు కొంతమంది మహిళా పోలీసులకు దెబ్బలు తగలడంతో మహిళా డీఎస్పీ కన్నీరు పెట్టుకున్నారు. 

Advertisement
Advertisement