హ్యూస్టన్‌లో నాట్స్ బాలల సంబరాలు

ABN , First Publish Date - 2020-02-04T17:05:46+05:30 IST

హ్యూస్టన్‌లో నాట్స్ బాలల సంబరాలు

హ్యూస్టన్‌లో నాట్స్ బాలల సంబరాలు

  • వివిధ విభాగాల్లో చిన్నారులకు పోటీలు
  • ప్రతిభ చాటిన చిన్నారులకు ప్రత్యేక బహుమతులు

విద్యార్ధుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సాహించేందుకు.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) హ్యూస్టన్‌లో బాలల సంబరాలను నిర్వహించింది. హ్యూస్టన్‌లోని మిస్సోరిలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న నాట్స్.. బాలల సంబరాల కోసం చిన్నారులకు మ్యాథ్స్ ఛాలెంజ్, తెలుగు మాట్లాట, స్పెల్లింగ్ బీ పోటీలు నిర్వహించింది. 8 ఏళ్ల లోపు చిన్నారులను జూనియర్, సీనియర్ల విభాగాలుగా విభజించి ఈ పోటీలు నిర్వహించింది. మూడు విభాగాలలో దాదాపుగా 120 మంది పిల్లలు తమ ప్రజ్ఞపాటవాలను ప్రదర్శించారు. అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారికి నాట్స్ బహుమతులు అందజేసింది. హ్యూస్టన్, గ్రేటర్ హౌస్టన్ నుంచి దాదాపుగా 300 పైగా తెలుగువారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

తక్కువ సమయంలో తమ పిలుపు అందుకుని మేము సైతం అని తమ సహాయ సహకారాలు అందించిన వాలంటీర్స్‌కు నాట్స్ సౌత్ సెంట్రల్ కో-ఆర్డినేటర్ హేమంత్ కొల్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాలుపంచుకున్న ఐ లెవెల్ లెర్నింగ్ సెంటర్, సిలికాన్ ఆంధ్ర మనబడి వారిని నాట్స్ బోర్డు సభ్యులలో ఒకరైన సునీల్ పాలేరు అభినందించారు. దాదాపు నెల రోజుల నుంచి శ్రమించి ఈ కార్యక్రమాన్ని నాట్స్ వాలంటీర్లు విజయవంతం చేశారని నాట్స్ హౌస్టన్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ కాకుమాను అన్నారు. "భాషే రమ్యం, సేవే గమ్యం" అనే నాట్స్ సూత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో నాట్స్ హ్యూస్టన్ సభ్యులు చూపిస్తున్న చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 

హ్యూస్టన్ నాట్స్ కోర్ కమిటీ సభ్యులు వీరూ కంకటాల, చంద్ర తెర్లి, విజయ్ దొంతరాజు తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు తమ వంతు కృషి చేశారు. అదే విధంగా ఈ కార్యాక్రమం కోసం తమ సహాయసహకారాలు అందజేసిన తెలుగు భవనం, హ్యుస్టన్ తెలుగు సాంస్కృతిక కమిటీ(టీసీఏ), తెలంగాణ గ్రేటర్ హౌస్టన్ సంఘం(టీఏజీహెచ్) సభ్యులకు నాట్స్ హౌస్టన్ విభాగం తమ ఆత్మీయ కృతజ్ఞతలు తెలిపింది.

Updated Date - 2020-02-04T17:05:46+05:30 IST