వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యుమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ప్రకాష్‌తో నాట్స్ వెబినార్

ABN , First Publish Date - 2020-09-21T09:21:42+05:30 IST

అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న

వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యుమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ప్రకాష్‌తో నాట్స్ వెబినార్

ఎడిసన్, న్యూజెర్సీ: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తాజాగా వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యుమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ప్రకాష్‌తో వెబినార్ నిర్వహించింది. ఎంత పెద్ద లెక్కయినా చిటికెలో చెప్పేసే భాను ప్రకాశ్ మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ ఆగస్ట్ 2020లో స్వర్ణ పతకం సాధించాడు. నాలుగు ప్రపంచ రికార్డ్స్, 50 లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెడ్ ఎక్స్ స్పీకర్‌గా కూడా అంకెల రహస్యాలను చెప్పిన నీలకంఠ భాను ప్రకాష్ దాదాపు 15 దేశాల్లో వర్క్ షాప్స్ నిర్వహించి తన గణిత మేథస్సును ప్రపంచానికి చాటాడు. 


ప్రవాస భారతీయులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వారి సందేహాలను నివృత్తి చేశాడు. నాట్స్ నుంచి నాయకులు గంగాధర్ దేసు, మురళీకృష్ణ మేడిచెర్ల ఈ వెబినార్‌కు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. మహిత అప్పసాని, సిద్ధార్థ జయంతి, సుచరిత జయంతి, భవిష్ గుమ్మడిలు ఈ వెబినార్‌లో ఉపయుక్తమైన ప్రశ్నలతో వెబినార్‌ను ఆసక్తికరంగా మార్చారు. నాట్స్ బోర్డు డైరెక్టర్ గంగాధర్ దేసు, సిద్దార్ధ, సుచరితలను దృష్టిలో పెట్టుకుని భాను ప్రకాష్‌ను ఉద్దేశించి ఉభయ భాషా పరిపక్వత వల్ల మేధోశక్తి పెరుగుతుందా అంటే.. అది చాలా ఉపయుక్తంగా ఉంటుందని భాను వివరించిన వివరణతో మిగతా విద్యార్థులు ఏకీభవించారు.


విద్యార్ధుల్లో లెక్కలంటే భయం పొగొట్టి.. అంకెలతో ఆడుకునేలా చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నానని నీలకంఠ భాను ప్రకాష్ తెలిపాడు. మ్యాథ్స్ మ్యాజిక్ విత్ భాను ప్రకాష్ పేరుతో నిర్వహించిన ఈ వెబినార్‌కు తెలుగువారి నుంచి మంచి స్పందన లభించింది. విద్యార్ధులు కూడా ఈ వెబినార్‌లో పాల్గొని క్లిష్టమైన లెక్కలను అడగగా.. భాను ప్రకాశ్ వారికి క్షణాల్లో సమాధానం చెప్పడం అందరిని అబ్బుర పరిచింది. మ్యాథ్స్ ద్వారా మేథస్సును ఎలా పెంచుకోవచ్చు..? మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో మ్యాథ్స్ ఎలా ఉపయోగపడుతుందనేది ఈ వెబినార్‌లో నీలకంఠ భాను ప్రకాష్ వివరించారు. 


నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే ఈ వెబినార్‌ నిర్వహణకు సహాయ సహకారాలు అందించారు. భాను ప్రకాష్ నిర్వహిస్తున్న ఎక్స్‌ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అనే సంస్థ ద్వారా అమెరికాలో తెలుగు వారికి సహాయపడేందుకు తమ వంతు కృషిగా నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, ప్రెసిడెంట్ శేఖర్ అన్నే తెలియజేశారు. కాగా.. ఆన్‌లైన్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు అడిగిన ప్రశ్నలకు భాను ప్రకాష్ సమయాభావం వల్ల నాట్స్ వరల్డ్.ఆర్గ్ ద్వారా సందేహ నివృత్తి చేస్తాడని.. నీలకంఠ భాను ప్రకాష్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ  విశేషాలను ఈ నెల నాట్స్ అక్షర దీపికలో చూడవచ్చని నాట్స్ సభ్యులు తెలిపారు.

Updated Date - 2020-09-21T09:21:42+05:30 IST