Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాట్స్.. ఫ్రీ 'జుంబా' వెబినార్

వివిధ సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలతో అమెరికాలోని తెలుగు వారిని అలరిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) మరో విభిన్న కార్యక్రమం 'జుంబా'తో ముందుకు వచ్చింది. జూమ్ యాప్ ద్వారా వర్చువల్‌గా జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచే ఆసక్తి గల వారు  http://natsworld.org/zumba-fitness అనే లింక్ ద్వారా తమ పేరును చేసుకోవాలని నాట్స్ కల్చరల్ బృందం వెల్లడించింది. 'ఎఫ్2-ఫన్ అండ్ ఫిట్‌నెస్' పేరుతో నాట్స్ హ్యూస్టన్ టీమ్ పూర్తి ఉచితంగా దీనిని అందిస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 7 నుంచి ప్రతి బుధవారం(14,21,28వ తేదీల్లో) రాత్రి 6 గంటల నుంచి 7 గంటల వరకు ఒక గంట ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం నాట్స్ అధికారిక వెబ్‌సైట్ www.natsworld.orgలో చూడొచ్చు.   


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement