నత్తకే.. నడక!

ABN , First Publish Date - 2022-05-30T06:50:00+05:30 IST

జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరై ఏడేళ్లు దగ్గరపడుతున్న ఇప్పటికీ సగం కూడా నిర్మాణం కాలేదు. టెండర్‌లు అయిన ఇళ్ల నిర్మాణం కూడా పూర్తికాలేదు. అధికారులు ఎన్నిసార్లు టెండర్‌లు పిలిచిన కాంట్రాక్టర్‌లు ముందుకు రాకపోవడంతో ముందుగా అనుమతులు పొందిన ఇళ్ల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. నిర్మాణభారం భారీగా పెరగడంతో కొత్తగా టెండర్‌లు వేసేందు కు ఎవరూ ముందుకు రావడంలేదు.

నత్తకే.. నడక!
నగరంలోని బైపాస్‌ రోడ్‌లో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరై ఏడేళ్లయినా.. ఇప్పటికీ పూర్తికాని సగం ఇళ్లు 

ధరలు పెరగడంతో నిర్మాణంలోనే నిలిచిపోతున్న ఇళ్లు 

పెరిగిన ధరలతో కొత్త ఇళ్ల నిర్మాణానికి ముందుకురాని కాంట్రాక్టర్‌లు

నిజామాబాద్‌, మే 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరై ఏడేళ్లు దగ్గరపడుతున్న ఇప్పటికీ సగం కూడా నిర్మాణం కాలేదు. టెండర్‌లు అయిన ఇళ్ల నిర్మాణం కూడా పూర్తికాలేదు. అధికారులు ఎన్నిసార్లు టెండర్‌లు పిలిచిన కాంట్రాక్టర్‌లు ముందుకు రాకపోవడంతో ముందుగా అనుమతులు పొందిన ఇళ్ల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. నిర్మాణభారం భారీగా పెరగడంతో కొత్తగా టెండర్‌లు వేసేందు కు ఎవరూ ముందుకు రావడంలేదు. పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌బి శాఖల ద్వారా నిర్మాణాలు కొనసాగుతున్న ఎమ్మెల్యేలు దృష్టిపెట్టిన కొన్నిచోట్ల మాత్రమే ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణం అయిన ఇళ్లు కూడా కొన్నిచోట్ల పంపిణికాకపోవడంతో లబ్దిదారులు ఈ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.

ఏడేళ్ల క్రితం మంజూరైన ఇళ్లు

జిల్లాలో పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరు నియోజకవర్గాల పరిధి లో కొత్త ఇళ్లను ఏడేళ్ల క్రితం మంజూరు చేసింది. నియోజకవర్గాల వారిగా ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని కోరింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతంలో రూ.5లక్షల 4వేలు, పట్టణ ప్రాంతంలో రూ.5 లక్షల 30వేలను కే టాయించింది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేల ప్రాతినిథ్యంకు అ నుగుణంగా ఇళ్ల కేటాయింపులు చేశారు. నిదులను కూడా కేటాయించారు. జిల్లా లో ఆరు నియోజకవర్గాల పరిదిలో ప్రభుత్వం 14,797 ఇళ్లను మంజూరు చేసిం ది. ఈ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం నియోజకవర్గా ల పరిధిలో ఇళ్లను మంజూరు చేయడంతో 12,827 ఇళ్లకు టెండర్‌లు ఖరారు చే శారు. ఈ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌లను కోరారు. ఏడేళ్ల క్రితం ఇళ్లు మంజూరైన సమయంలో ఉన్న రేట్లు సంవత్సరం సంవత్సరం పెరుగుతుండడంతో కాంట్రాక్టర్‌లు కొన్నిచోట్ల చేతులెత్తేశారు. సిమెంట్‌, ఐరన్‌తో పాటు ఇతర సామగ్రి ధరలు ఎక్కువ కావడంతో కొన్నిచోట్ల నిర్మాణాలు చేపట్ట లేదు. జిల్లాలో మంజూరైన మొత్తం ఇళ్లలో ఇప్పటి వరకు 7161 ఇళ్లకు మాత్రమే నిర్మాణాలు చేపట్టారు. 5,666 ఇళ్లకు ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టలేదు. జిల్లాలో చేపట్టిన ఇళ్లలో జిల్లాలో ఇప్పటి వరకు 4,441 ఇళ్లు బేస్‌మెట్‌ లెవల్‌లోనే ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న ఇళ్లలో 1,212 ప్లింత్‌ లెవల్‌లో 722 ఇళ్లు, గ్రూప్‌ లెవల్‌లో ని ర్మాణంలో ఉన్నాయి. జిల్లాలో టెండర్‌ అయిన ఇళ్లలో 737 ఇళ్లకు గోడల నిర్మాణం చేయ గా 999 ఇళ్లకు ప్లాస్టరింగ్‌ను పూర్తిచేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,999 ఇళ్లను పూర్తిచేశారు. వీటిలో బాన్సూవాడ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి, వర్ని, రుద్రూర్‌ మండలాల్లో కొన్ని ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధిలో కొన్ని ఇళ్లను ఇచ్చారు. మిగతా ఇళ్ల పంపిణీ కోసం ఏర్పాట్లను చేస్తున్నా రు. జిల్లాలో ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.213 కోట్లను వెచ్చించారు.

రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలు

జిల్లాలో బవన నిర్మాణంకు సంబందించిన మెటిరియల్‌ ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం కేటాయించిన నిధులతో కట్టే అవకాశం లేకపోవడంతో టెండర్‌లు వేసిన కాంట్రాక్టర్‌లు చాలాచోట్ల చేతులెత్తేశారు. కొన్నిచోట్ల వారు ముందుకు రాకపోవడంతో అదికారులు టెండర్‌లను రద్దుచేశారు. కొత్త టెండర్‌లను పిలిచిన ఎవరు ముందుకురాకపోవడంతో ఆ ఇళ్లు నిర్మాణం కావడంలేదు. 

Updated Date - 2022-05-30T06:50:00+05:30 IST