Abn logo
Sep 21 2020 @ 20:41PM

‘దెయ్యంతో సహజీవనం’ చేయబోతోన్న నిర్మాత తనయ

Kaakateeya

నిర్మాత నట్టికుమార్‌ తనయ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. విశేషం ఏమిటంటే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న చిత్రానికి ఆయనే దర్శకుడు. నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'దెయ్యంతో సహజీవనం'(డిఎస్‌జె). ఈ మూవీ సోమవారం ప్రారంభమైంది. నట్టి లక్ష్మి సమర్పిస్తున్న ఈ చిత్రానికి  నిర్మాతలు అనురాగ్ కంచర్ల, నట్టి క్రాంతి. ముహూర్తపు షాట్‌కి నట్టి క్రాంతి గౌరవ దర్శకత్వం చేయగా... కెమెరా నట్టి లక్ష్మీ స్విచాన్ చేశారు. ప్రముఖ ఎడిటర్ గౌతం రాజు క్లాప్‌తో ఈ చిత్రం మొదలైంది.

''ఈ చిత్రాన్ని ఒక యథార్థ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. తనకు జరిగిన అన్యాయానికి ఒక ఆత్మ  ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే దానిని చాలా వినూత్నంగా చూపిస్తున్నాం. వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో అత్యద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ ఇందులో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలానే సుపర్ణ మలాకర్ అనే బెంగాల్ అమ్మాయి ఇందులో సెకెండ్ హీరోయిన్‌గా ఓ పవర్ ఫుల్ కాల్ గర్ల్ పాత్రలో పోషిస్తోంది. ఆమెతో ఓ ఐటెం సాంగ్ కూడా చేస్తున్నాం.  ఏకధాటిగా షూటింగ్‌ చేయబోతున్నాం. గతంలో ఏడాదికి 8 నుంచి 9 సినిమాలు నిర్మించాను. ఇక రాబోయే కాలంలో కూడా ఏడాదికి 15 సినిమాల వరకు నిర్మించాలనే నిర్ణయంలో ఉన్నాను." అని నిర్మాత, ఈ చిత్రం దర్శకుడు నట్టి కుమార్ తెలిపారు.


హీరోయిన్‌గా పరిచయం అవుతున్న నట్టి కరుణ మాట్లాడుతూ.. గతంలో నాన్న నిర్మించిన చిత్రాలకు ప్రొడక్షన్ అంతా నేనే చూసుకున్నా. ఆ అనుభవం చిత్రానికి ఎంతో ఉపయోగపడుతుంది. నాన్న డైరెక్షన్‌లో ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా వుంది. నాన్న నా మీద పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగానే ఇందులో నటిస్తానని ఆశిస్తున్నా. మీ ఆశీర్వాదం నాకు కావాలి. భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటించేలా నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. నట్టి కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నందుకు ఆనందంగా వుంది. మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తప్పకుండా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అవుతుందని ఆశిస్తున్నాని అన్నారు హీరో రాజీవ్ సాలూరు. 

Advertisement
Advertisement
Advertisement