Abn logo
Apr 7 2020 @ 13:58PM

లాక్‌డౌన్ సమయంలో జోరుగా సారా విక్రయాలు

చిత్తూరు జిల్లా: లాక్ డౌన్ సమయంలో చిత్తూరు జిల్లాలో నాటు సారా ఏరులైపారుతోంది. పైగా నాటు సారా తాగితే కరోనా వైరస్ రాదన్న దుష్ప్రచారం పతాకస్థాయిలో నడుస్తోంది. దీంతో నాటుసారా మాఫియా పెట్రేగిపోతోంది. మామూలు రోజుల్లో లీటరు రూ. 20కి అమ్మే నాటు సారా.. ఇప్పుడు ఏకంగా వెయ్యి రూపాయలకు అమ్ముతోంది. కార్వేటినగరం, తిరుపతి మార్గంలో సారా రవాణా అక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. మద్యానికి బానిస అయ్యేవారు నాటు సారాను ఎంతధరకైనా కొనుగోలు చేస్తున్నారు. దీనిపై ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదులు వెళ్లడంతో మంగళవారం ఉదయం చిత్తూరులో తనిఖీలు చేశారు. నాటు సారా తీసుకువెళుతున్న ఆరుగురిన అరెస్టు చేశారు. 41 లీటర్ల సారాతోపాటు ఆరు బైకులను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement
Advertisement