జీఎస్‌టీ పరిధిలోకి సహజవాయువు ?

ABN , First Publish Date - 2022-01-27T22:35:09+05:30 IST

సహజవాయువు వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి రానుందా ? కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తోందా ? ఈ ప్రశ్నలకు కేంద్ర వర్గాల నుంచి భిన్నమైన సమాధానాలే వస్తున్నాయి.

జీఎస్‌టీ పరిధిలోకి సహజవాయువు ?

న్యూఢిల్లీ : సహజవాయువు వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి రానుందా ? కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తోందా ? ఈ ప్రశ్నలకు కేంద్ర వర్గాల నుంచి భిన్నమైన సమాధానాలే వస్తున్నాయి. సహజవాయువును జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని... ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ(ఎఫ్‌ఐపీఐ) కోరుతోంది. పైప్‌లైన్ ద్వారా సహజ వాయువు రవాణాపై జీఎస్‌టీని హేతుబద్ధీకరించాలని, దిగుమతి చేసుకున్న ఎల్‌ఎన్‌జీని గ్యాస్‌గా మార్చాలంటూ కేంద్రాన్ని కోరుతోంది. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం ప్రధాని నరేంద్ర మోడీ పర్యావరణ అనుకూల ఇంధన వాటాను పెంచడానికి సహజ వాయువును జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని పరిశ్రమల సంఘం పేర్కొంది.


రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సహా ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పరిశ్రమల సంస్థ సహజవాయువును జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని గతంలో చాలాసార్లు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ‘జీఎస్‌టీలో సహజ వాయువును చేర్చకపోవడం వల్ల సహజ వాయువు ధరలు ప్రతికూల  ప్రభావితమవుతున్నాయి. గ్యాస్ ఉత్పత్తిదారులు/సరఫరాదారులు వివిధ రకాల పన్నులను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఎఫ్‌ఐపీఐ పేర్కొంటోంది. ముడి చమురు, సహజ వాయువు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వంటి పెట్రోలియం ఉత్పత్తులను వీలైనంత త్వరగా జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని పరిశ్రమల సంఘం డిమాండ్ చేస్తోంది. కాలుష్యకారక ద్రవ ఇంధనంతో ఎల్‌ఎన్‌జీని పోటీపడేలా చేసేందుకు దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించాలని కోరింది.

Updated Date - 2022-01-27T22:35:09+05:30 IST