Abn logo
Sep 25 2021 @ 23:23PM

ప్రకృతి వ్యవసాయం ప్రయోజనకరం

గండికొవ్వూరులో పొలంబడి నిర్వహిస్తున్న ఏపీసీఎన్‌ఎఫ్‌ సిబ్బంది

చక్రాయపేట, సెప్టెంబరు 25: ప్రకృతి వ్యవసాయం అన్ని విధాలా ప్రయోజనమని ఏపీసీఎన్‌ఎఫ్‌ సిబ్బంది పేర్కొన్నారు. శనివారం గం డికొవ్వూరులో నిర్వహించిన పొలంబడిలో ద్రావణాలు, కషాయాలు, విత్తన బ్యాంక్‌, పీఎండీఎస్‌పై శిక్షణ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయ పద్దతిలో బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం తయారీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏపీసీఎన్‌ఎఫ్‌ సిబ్బంది, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.