Oct 17 2021 @ 08:10AM

రామ్‌చరణ్‌ వదిలిన 'నాట్యం' థియేట్రికల్ ట్రైలర్..

మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్‌ తాజాగా 'నాట్యం' మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న సినిమా ఇది. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వంలో నృత్య నేపథ్యంలో తెరకెక్కించారు. నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ మూవీని ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను రామ్‌చరణ్‌ విడుదల చేసి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాలను పెంచుతోంది. కాగా ఇందులో కమల్‌కామరాజ్‌, రోహిత్‌ బెహల్‌, ఆదిత్య మేనన్‌ తదితరులు నటించారు. శ్రావణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.