Abn logo
Apr 19 2021 @ 21:58PM

నవమికి ముస్తాబవుతున్న రామమందిరాలు

 మనుబోలు, ఏప్రిల్‌ 19: శ్రీరామనవమిని పుర స్కరించుకుని గ్రామాల్లో రామమందిరాలు ముస్తాబ వుతున్నాయి. బుధవారం శ్రీరామనవమి కావడంతో రెండు రోజులు నుంచే మందిరాలను రంగులతో తీర్చిదిద్దుతున్నారు. విద్యుద్దీపాలతో మందిరాలను శోభాయమానంగా అలంకరించ నున్నారు. నవమి నుంచి ప్రతి గ్రామంలో ఉభయాలు నిర్వహించేలా మందిరాల నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement