ఎదురు చూడాల్సిన ఫోన్‌ అది కాదు, ఇదీ!

ABN , First Publish Date - 2020-02-28T02:26:32+05:30 IST

గూగుల్‌ మ్యాప్స్‌ ఇప్పుడు అందరూ వాడుతూనే ఉన్నాం. కానీ మన ఇల్లూ ఆఫీసూ ఎక్కడున్నాయో ఎవడో గూగులోడు చెప్పడం ఏంటి?

ఎదురు చూడాల్సిన ఫోన్‌ అది కాదు, ఇదీ!

గూగుల్‌ మ్యాప్స్‌ ఇప్పుడు అందరూ వాడుతూనే ఉన్నాం. కానీ మన ఇల్లూ ఆఫీసూ ఎక్కడున్నాయో ఎవడో గూగులోడు చెప్పడం ఏంటి? మన దేశం నెత్తిమీద మనం సొంతంగా సెటిలైట్లు పెట్టుకుని దారులు తెలుసుకోలేమా?  - అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఆల్రెడీ మన ఇస్రోవాళ్లకి ఎప్పుడో అనిపించింది. అందుకే గూగుల్‌ మ్యాప్స్‌ కి ప్రత్యామ్నాయంగా -  ఇస్రోవాళ్లు నావిక్‌ (NavIC - నావ్‌ ఐసీ ) అనే మరో మ్యాపింగ్‌ సిస్టమ్‌ని తయారుచేశారు. నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాన్‌స్టలేషన్‌ (Navigation with Indian Constellation) అన్నది దీని పూర్తి పేరు. ఇది ఇప్పటికే సిద్ధంగా ఉంది.


అయితే మన సొంత భారతీయ మ్యాప్స్‌ సిస్టమ్‌ రెడీగా ఉందనగానే ఎవరికైనా అనిపించేది ఏమిటి?  మొట్టమొదటిసారిగా ఈ మ్యాపింగ్‌ సిస్టమ్‌తో ఏ స్మార్ట్‌ ఫోన్‌ వస్తుందీ అని...! ఆ గొప్ప మాదే కాబోతోంది అంటూ ఆ మధ్య రెడ్‌మీ వాళ్లు ఓ ప్రకటన ఇచ్చారు. కానీ రియల్‌గా చూస్తే - ఆ క్రెడిట్‌ కాస్తా రియల్‌ మీ వాళ్లు పట్టుకుపోయేలా ఉన్నారు. ఇస్రో వారి నావిక్‌ తో మొట్టమొదటగా వస్తున్న ఫోన్‌ ఏంటో తెలుసా? రియల్‌ మీ ఎక్స్‌ 50 ప్రో ( Realme X50 Pro ). ఈ ఫోన్‌ ప్రపంచంలోనే నావిక్‌ ని ఉపయోగిస్తున్న మొట్టమొదటి ఫోన్‌ అవుతుంది - అని రియల్‌ మీ వాళ్లు చెబుతున్నారు. మొదటిదే కాదు, రెండోది మూడోది .. ఇలా ఈ సీరీస్‌ లో చాలా వస్తాయట. మార్చి 5 కల్లా మరిన్ని వివరాలు బయటకి రానున్నాయి. అన్నట్టు మరో ముఖ్య విషయం. ఇండియాలో మొదటిగా వస్తున్న 5G ఫోన్‌ కూడా ఇదే! సో...  ఈ ఫోన్‌ కోసం ఎదురుచూద్దాం!

Updated Date - 2020-02-28T02:26:32+05:30 IST