లఖింపూర్ ఘటనపై నిరసన, సిద్ధూ అరెస్టు

ABN , First Publish Date - 2021-10-04T20:46:49+05:30 IST

శాంతియుత నిరసనలు తెలుపుతున్న రైతులపై వాహనాలు నడిపి వారి మృతికి కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలని..

లఖింపూర్ ఘటనపై నిరసన, సిద్ధూ అరెస్టు

చండీగఢ్: యూపీలోని లఖింపూర్‌లో శాంతియుత నిరసనలు తెలుపుతున్న రైతులపై వాహనాలు నడిపి వారి మృతికి కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలని పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. లఖింపూర్ ఘటనపై చేసిన ప్రకటనలకు గాను హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టార్‌పై దోశద్రోహం కేసు నమోదు చేయాలన్నారు. లఖింపూర్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో రైతుల మృతికి నిరసనగా పంజాబ్ గవర్నర్ నివాసం వెలుపల సిద్ధూ, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధూను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.


మరోవైపు, లఖింపూర్ ఖేరీ హింసాకాండ అనంతరం బాధితులను పరామర్శించేందుకు ఛత్తీస్ ఘడ్ సీఎం బాఘేల్, పంజాబ్ డిప్యూటీ సీఎం రాంధవాలను అనుమతించరాదని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ సర్కారు నిర్ణయించింది. బాధితులను పరామర్శించేందుకు వస్తున్న ప్రియాంకగాంధీని సైతం సోమవారం ఉదయం యూపీ పోలీసులు అడ్డుకొని నిర్బంధించారు.

Updated Date - 2021-10-04T20:46:49+05:30 IST