ముగిసిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2020-10-25T10:52:16+05:30 IST

తిరుమల వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. కొవిడ్‌ కారణంగా వార్షిక బ్రహ్మోత్సవాల..

ముగిసిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల, అక్టోబరు 24: తిరుమల వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. కొవిడ్‌  కారణంగా వార్షిక బ్రహ్మోత్సవాల తరహాలోనే ఈ ఉత్సవాలను కూడా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.నవరాత్రి బ్రహ్మోత్సవాలను పరిమిత భక్తుల నడుమ మాడవీధుల్లో నిర్వహించాలని తొలుత టీటీడీ అనుకున్నప్పటికీ భక్తులు, టీటీడీ ఉద్యోగుల ఆరోగ్యానికి మంచిదికాదనే ఉద్దేశంతో చివరకు ఏకాంతంగానే వాహన సేవలను నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే 16 నుంచి 24వ తేదీ వరకు ఆలయంలోనే వాహనసేవలు వైభవంగా నిర్వహించారు.


మరోవైపు యాగశాలలో కూడా వైదిక కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిపించారు. చివరిరోజైన శనివారం ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలోని అయిన మహల్‌ ముందు ఏర్పాటు చేసిన మినీ పుష్కరిణిలో చక్రత్తాళ్వారును మునకలు వేయించి పుణ్యస్నానం పూర్తి చేశారు. తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాల్లో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి చక్రస్నానం నిర్వహిస్తారు. కాగా, రాత్రి 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి  బంగారు తిరుచ్చి నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ ఊరేగించారు. దీంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. 

Updated Date - 2020-10-25T10:52:16+05:30 IST