విమానం ఇంజిన్‌లో ఇంధనం లీక్ .. గోవాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భారత నావికాదళంపై ప్రశంసల వర్షం!

ABN , First Publish Date - 2021-11-05T01:49:51+05:30 IST

బ్యాంకాక్ నుంచి ఇజ్రాయిల్ రాజధానికి వెళుతున్న ఓ విమానంలో అనుకోని సమస్య తలెత్తడంతో గోవాలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ క్రమంలో విమానం దిగేందుకు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసిన భారత నేవీపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

విమానం ఇంజిన్‌లో ఇంధనం లీక్ .. గోవాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భారత నావికాదళంపై ప్రశంసల వర్షం!

ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకాక్ నుంచి ఇజ్రాయిల్ రాజధానికి వెళుతున్న ఓ విమానంలో అనుకోని సమస్య తలెత్తడంతో గోవాలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ క్రమంలో విమానం దిగేందుకు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసిన భారత నేవీపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. నవంబర్ 1న జరిగిన ఈ ఉదందతం ప్రస్తుతం వైరల్ అవుతోంది. విమానంలోని ఓ ఇంజిన్‌లో ఇంధనం లీకవడం గుర్తించిన పైలట్ వెంటనే దాన్ని ఆపేశారు. మిగిలిన ఒక్క ఇంజిన్ సాయంతోనే ప్రయాణాన్ని కొనసాగిస్తూ..ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ప్రకారం..ఈ విషయాన్ని గ్రౌండ్ కంట్రోల్‌కు తెలియజేశారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు ఉపక్రమించారు. 


కాగా.. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన భారత నేవీ విమానం ల్యాండయ్యేందుకు వీలుగా గోవాలోని డబోలిమ్‌లో ఉన్న వైమానిక స్థావరాన్ని సిద్ధం చేసింది. మరమ్మతుల కోసం మూసివేసిన ఎయిర్‌ఫీల్డ్‌లో నిమిషాల వ్యవధిలో అత్యవసర ల్యాండింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో.. విమానం సురక్షితంగా ల్యాండయ్యింది. ఈ విషయాన్ని నేవీ అధికారి ప్రతినిధి ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. విమానంలోని 276 మంది క్షేమంగానే ఉన్నారని తెలిపారు. దీంతో.. నెటిజన్లు నేవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 



Updated Date - 2021-11-05T01:49:51+05:30 IST