40 మంది నేవీ సిబ్బందికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-01-17T05:23:00+05:30 IST

తూర్పు నౌకాదళంలో కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చీఫ్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌ జైన్‌ శనివారం ప్రారంభించారు.

40 మంది నేవీ సిబ్బందికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌
కల్యాణి ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ కేంద్రం ప్రారంభిస్తున్న ఈఎన్‌సీ చీఫ్‌ అతుల్‌కుమార్‌ జైన్‌

విశాఖపట్నం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): తూర్పు నౌకాదళంలో కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చీఫ్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌ జైన్‌ శనివారం ప్రారంభించారు. నేవీ ఆస్పత్రి కల్యాణిలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో  40 మందికి తొలి రోజు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. వీరిలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, హెల్త్‌ వర్కర్లు, వార్డు సహాయకులు, మెడికల్‌ అసిస్టెంట్లు ఉన్నారు. ఈ కేంద్రం కోసం జిల్లా ఆరోగ్య శాఖాధికారులతో కలిసి ముందుగానే తగిన శిక్షణ తీసుకుని, రియల్‌ టైమ్‌ మానటరింగ్‌ వ్యవస్థ ద్వారా టీకా తీసుకున్నవారిని గమనిస్తున్నట్టు అతుల్‌ కుమార్‌ జైన్‌ పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న నేవీ ఉద్యోగులు అందరికీ దశలవారీగా రాబోయే నెలల్లో ఈ వ్యాక్సిన్‌ ఇస్తామని చెప్పారు. 


Updated Date - 2021-01-17T05:23:00+05:30 IST