సమీర్‌వాంఖడే నిఖానామాను వెల్లడించిన మంత్రి నవాబ్‌మాలిక్...కులధ్రువీకరణ పత్రం forged అంటూ ఆరోపణ

ABN , First Publish Date - 2021-10-27T17:22:34+05:30 IST

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును విచారిస్తున్న నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడే నికాహ్ నామాను మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ బుధవారం ట్విట్టరులో పోస్టు చేసి సంచలనం రేపారు...

సమీర్‌వాంఖడే నిఖానామాను వెల్లడించిన మంత్రి నవాబ్‌మాలిక్...కులధ్రువీకరణ పత్రం forged అంటూ ఆరోపణ

ముంబై: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును విచారిస్తున్న నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడే నికాహ్ నామాను మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ బుధవారం ట్విట్టరులో పోస్టు చేసి సంచలనం రేపారు. సమీర్ వాంఖడే మోసపూరిత మార్గంతో తప్పుడు కుల ధ్రువీకరణ పొందాడని నవాబ్ ఆరోపించారు. ‘‘సమీర్ దావూద్ వాంఖడే గురించి నేను బహిర్గతం చేస్తున్న విషయం అతని మతానికి సంబంధించినది కాదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. అతను కుల ధృవీకరణ పత్రం పొందిన మోసపూరిత మార్గాన్ని వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాను. ఐఆర్ఎస్ ఉద్యోగం పొందిన వాంఖడే అర్హులైన షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి భవిష్యత్తును దూరం చేశాడు.’’ అని విలేకరుల సమావేశంలో నవాబ్ మాలిక్ ఆరోపించారు.


సమీర్ దావూద్ వాంఖడే తన మొదటి భార్య డాక్టర్ షబానా ఖురేషిల ఫొటోను మంత్రి ట్విట్టరులో పోస్టు చేశారు.డాక్టర్ షబానా ఖురేషీతో సమీర్ వాంఖడే మొదటి వివాహం యొక్క నికాహ్ నామా కాపీని, సంబంధిత ఫొటోలను కూడా నవాబ్ మాలిక్ ట్విట్టరులో పంచుకున్నారు. ‘‘స్వీట్ కపుల్ సమీర్ దావూద్ వాంఖడే, డాక్టర్ షబానా ఖురేషీల ఫొటో’’ అని నవాబ్ మాలిక్ ట్విట్టర్‌లో మరో పోస్ట్‌లో తెలిపారు.‘‘నేను ట్వీట్ చేసిన కుల ధ్రువీకరణ పత్రం అబద్ధమని వారు చెబితే, వారు నిజమైన దానిని చూపించాలి. సాక్షుల గుర్తింపుపై ప్రభావం పడకుండా నేను వారి పేర్లను బ్లర్ చేశాను. 


నేను ట్వీట్ చేసిన సర్టిఫికేట్ బీఎంసీ నుంచి పొందిన అధికారిక పత్రం. ఒక వ్యక్తి వేరే మతంలోకి మారితే, అతని కులం ప్రయోజనాలను పొందడం మానేస్తాడని చట్టం చెబుతోంది’’ అని నవాబ్ మాలిక్ అన్నారు. సమీర్ ముస్లిమ్ కాదని అతని రెండో భార్య, మరాఠీ నటి క్రాంతి రెడ్కర్ చెప్పిన రెండో రోజే మంత్రి నవాబ్ తన వద్ద ఉన్న ఆధారాలను బహిర్గతం చేశారు. 


Updated Date - 2021-10-27T17:22:34+05:30 IST