ఫడ్నవిస్‌కు నవాబ్ మాలిక్ మేనల్లుడు లీగల్ నోటీసు

ABN , First Publish Date - 2021-11-11T16:57:33+05:30 IST

ఫడ్నవిస్‌కు నవాబ్ మాలిక్ మేనల్లుడు లీగల్ నోటీసు..

ఫడ్నవిస్‌కు నవాబ్ మాలిక్ మేనల్లుడు లీగల్ నోటీసు

ముంబై: మాజీ సీఎం దేవంద్ర ఫడ్నవిస్‌కు, మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌కు మధ్య కొనసాగుతున్న ఆరోపణల పర్వం అంతకంతకూ ముదురుతోంది. తాజాగా నవాబ్ మాలిక్ మేనల్లుడు సమీర్ ఖాన్ సైతం దీనికి తోడయ్యారు. తన పరువుకు భంగం కలిగించేలా ఫడ్నవిస్ తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆయనకు లీగల్ నోటీసు పంపారు. తనను మానసికంగా టార్చర్ పెట్టి, మానసిక సంక్షోభానికి, ఆర్థిక నష్టానికి గురిచేసినందున రూ.5 కోట్లు పరిహారం డిమాండ్ చేశారు.


కాగా, ఇప్పటికే ఫడ్నవిస్, మాలిక్ మధ్య ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీపావళి బాంబు పేలుస్తున్నానంటూ ఫడ్నవిస్ ఇటీవల నవాబ్‌మాలిక్‌పై సంచలన ఆరోపణలు చేశారు. దావూద్‌ గ్యాంగ్‌తో మాలిక్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని  ఆరోపించారు. ముంబై పేలుళ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషుల దగ్గరి నుంచి నవాబ్‌మాలిక్‌ చవగ్గా ఆస్తులను కొనుగోలు చేశారని ఆరోపించారు. నవాబ్‌మాలిక్‌ దగ్గర ఉన్న ఆస్తుల్లో నాలుగు ఆస్తులు అండర్‌వాల్డ్‌తో లింక్‌ ఉన్నాయని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. దీనికి ప్రతిగా నవాబ్ మాలిక్ 'హైడ్రోజన్ బాంబు' పేరుతో ఫడ్నివిస్‌పై ఆరోపణలు ఎక్కుపెట్టారు. ఫడ్నవిస్ హయాంలో ఆయన సహకారంతో మహారాష్ట్రలో నకలీ కరెన్సీ రాకెట్ నిరాఘాటంగా సాగిందన్నారు. దావూద్‌తో సంబంధాలున్న రియాన్ భాటిని రెండు రోజుల్లోనే వదిలేశారనీ , చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన హైదర్ అజాంను మౌలానా అజాద్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, నాగపూర్‌కు చెందిన నేరస్థుడు మున్నా యాదవ్‌ను నిర్మాణ రంగ కార్మికుల బోర్డుకు చైర్మన్‌గా నియమించారని అన్నారు.

Updated Date - 2021-11-11T16:57:33+05:30 IST