Abn logo
May 21 2020 @ 11:18AM

నవాజుద్దీన్ మొదటి భార్య అందుకే వెళ్లిపోయింది: రెండో భార్య ఆలియా

శారీరకంగా, మానసికంగా హింసించడం వల్లే నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ మొదటి భార్య విడాకులు ఇచ్చేసి వెళ్లిపోయిందని రెండో భార్య ఆలియా ఆరోపించింది. తనను కూడా అలా వేధించడం వల్లే విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించింది. లాక్‌డౌన్ వల్ల ఇప్పటికే వాట్సాప్, ఈ- మెయిల్ ద్వారా నోటీసులు పంపినట్టు తెలిపింది. 


`ఏ బంధంలోనైనా ఆత్మాభిమానం అనేది చాలా ముఖ్యం. ఆ విషయంలో నేను తీవ్రంగా దెబ్బ తిన్నాను. నవాజుద్దీన్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అతని తమ్ముడు షమాస్ నన్ను తీవ్రంగా ఇబ్బందిపెట్టారు. నవాజ్ కుటుంబ సభ్యులందరూ నన్ను మానసికంగా, శారీరకంగా హింసించారు. అందుకే ఈ బంధాన్ని తెంచుకుని నా పాత జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నా. అంజనా కిశోర్ పాండేగా మారబోతున్నా. నా ఇద్దరి పిల్లల్ని నేనే చూసుకుంటాన`ని ఆలియా తెలిపింది. 

Advertisement
Advertisement
Advertisement