ఆ హీరోల పక్కనే నయనతార ఇల్లు

అందంతో పాటు అభినయంలోను తనకు సాటిలేదని నిరూపించుకున్న నటి నయనతార. చెన్నై‌లోని పోయెస్ గార్డెన్‌లో ఆమె కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ప్రాంతంలో 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు కోలీవుడ్ మీడియా చెబుతోంది. చెన్నైలోని విలాసవంతమైన ప్రదేశాల్లో పోయెస్‌గార్డెన్ ఒకటి. తమిళనాడు దివంగంత ముఖ్యమంత్రి జయలలిత, రజినీకాంత్ తదితరుల నివాసాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ధనుష్ కొత్త ఇంటిని కూడా ఆ ప్రాంతంలోనే నిర్మిస్తున్నారు. రజినీకాంత్ ఇంటి పక్కనే దానిని నిర్మిస్తుండటం చెప్పుకోదగ్గ విశేషం. 


ప్రస్తుతం నయనతార టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోను నటిస్తోంది. ఆమె నటించిన ‘‘ కాతువాకుల రెండు కాదల్ ’’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నయనతార  పోయెస్ గార్డెన్‌లోనే మరో ఇంటిని కూడా కొనుగోలు చేయాలని ఆలోచించిస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె గత కొంత కాలంగా విఘ్నేష్ శివన్‌తో డేటింగ్ చేస్తోంది. 2022లో ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement