Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రైవర్‌ను ప్రశ్నించిన ఎన్‌సీబీ

ABN , First Publish Date - 2021-10-09T23:49:24+05:30 IST

క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ అగ్రనటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు అర్యన్ ఖాన్

Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రైవర్‌ను ప్రశ్నించిన ఎన్‌సీబీ

ముంబై: క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ అగ్రనటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు అర్యన్ ఖాన్ డ్రైవర్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ రోజు ప్రశ్నించింది. మరోవైపు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ నేడు కూడా ఎన్‌సీబీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నేత మోహిత్ కాంభోజ్ (భారతీయ) బావమరిదిని కూడా ఎన్‌సీబీ తొలుత అరెస్ట్ చేసిందని అయితే, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అతడిని విడిచిపెట్టిందని ఆరోపించారు. ఢిల్లీ, మహారాష్ట్ర బీజేపీ పెద్దల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌తోనే అతడిని విడిచిపెట్టారని ఆరోపించారు.


కాంభోజ్ బీజేపీ యువ మోర్చా మాజీ అధ్యక్షుడు. క్రూయిజ్ నౌకపై దాడి సమయంలో ఎన్‌సీబీ తొలుత 11 మందిని అదుపులోకి తీసుకుందని, ఆ తర్వాత సచ్‌దేవ్, ప్రతీక్ గాబా, ఆమిర్ ఫర్నిచర్‌వాలాను వదిలిపెట్టేశారని ఆరోపించారు. 


క్రూయిజ్ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న సినీ నిర్మాత ఇంతియాజ్ ఖత్రి ఇల్లు, కార్యాలయంలో ఎన్‌సీబీ దాడులు చేసింది. ఈ మేరకు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. దర్యాప్తులో ఖత్రి పేరు వెలుగులోకి వచ్చిందని తెలిపారు. 

Updated Date - 2021-10-09T23:49:24+05:30 IST