Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్‌సీసీ వార్షిక శిక్షణ శిబిరం ప్రారంభం

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 30: ఎన్‌సీసీ ఆంధ్రా బెటాలియన్‌–19 శిక్షణ శిబిరాన్ని పినకడిమిలోని సెయింట్‌ విన్సెంట్‌ డీపాల్‌ కళాశాలలో జిల్లా కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ అలోక్‌కుమార్‌ రాయ్‌ మంగళవారం ప్రారంభించారు. జిల్లాలో  వివిధ డిగ్రీ కళాశాలల నుంచి వచ్చిన 400 మంది కేడెట్లకు డిసెంబర్‌ 5 వరకు శిక్షణ ఇస్తారు. కమాండింగ్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ డ్రిల్‌, మ్యాప్‌ రీడింగ్‌, క్యాంపస్‌, వ్యక్తిత్వ వికాస తరగతులు, నాయకత్వ తరగతులు, రైఫిల్‌ షూటింగ్‌ తదితర అం శాల్లో శిక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ లెఫ్టి నెంట్‌ కల్నల్‌ సవరవ్‌ ముఖర్జీ, పర్యవేక్షకులు లెఫ్టినెంట్‌ నవీన్‌కుమార్‌, ఏఎన్‌వోలు, పిఐ సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement