విశాఖలో ఎన్‌సీసీ క్యాంప్‌

ABN , First Publish Date - 2021-02-25T05:13:32+05:30 IST

నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన ఎన్‌సీసీ కేడెట్స్‌కు 13వ ఆంధ్రా బెటాలియన్‌ ఆధ్వర్యంలో ఇక్కడి డాక్టర్‌ వీఎస్‌ కృష్ణా కళాశాలలో బుధవారం నుంచి ప్రత్యేక క్యాంప్‌ ప్రారంభించారు.

విశాఖలో ఎన్‌సీసీ క్యాంప్‌
క్యాంప్‌లో పాల్గొన్న ఎన్‌సీసీ కేడెట్స్‌

వీఎస్‌ కృష్ణా కళాశాలలో భారీ శిబిరం

13వ ఆంధ్రా బెటాలియన్‌ ఆధ్వర్యంలో నిర్వహణ

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన ఎన్‌సీసీ కేడెట్స్‌కు 13వ ఆంధ్రా బెటాలియన్‌ ఆధ్వర్యంలో ఇక్కడి డాక్టర్‌ వీఎస్‌ కృష్ణా కళాశాలలో బుధవారం నుంచి ప్రత్యేక క్యాంప్‌ ప్రారంభించారు. ఈ శిబిరం ఈనెల 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బెటాలియన్‌ కెప్టెన్‌ డాక్టర్‌ ఎన్‌.రామకృష్ణ తెలిపారు. ‘బీ’ సర్టిఫికెట్‌ కోసం మూడు రోజులు, ‘సీ’ సర్టిఫికెట్‌ కోసం ఐదు రోజులపాటు శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు.


శిక్షణలో భాగంగా కేడెట్స్‌కు నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం, ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పిస్తామని వివరించారు. పలువురు నిపుణులు హాజరై పలు అంశాలు వివరిస్తారన్నారు. ఇటువంటి శిక్షణ శిబిరాలు అనకాపల్లిలోని ఏఎంఏఎల్‌ కళాశాల, వియనగరంలోని ఎంఆర్‌ కళాశాలలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరం ప్రారంబానికి లెఫ్టినెంట్‌ ఎం.డి.సాజిత్‌, డాక్టర్‌ ఉమానాగేశ్వరి, అనంతరావు, సిహెచ్‌.నాయుడు హాజరయ్యారు.   

Updated Date - 2021-02-25T05:13:32+05:30 IST