ఎన్‌సీసీ డివిడెండ్‌ 10%

ABN , First Publish Date - 2020-05-30T07:42:53+05:30 IST

ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఎన్‌సీసీ లిమిటెడ్‌ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన

ఎన్‌సీసీ డివిడెండ్‌ 10%

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఈ ఏడాది మార్చితో ముగిసిన  త్రైమాసికానికి ఎన్‌సీసీ లిమిటెడ్‌ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.75.82 కోట్లకు తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో లాభం రూ.187.57 కోట్లతో పోలిస్తే 60 శాతం క్షీణించింది. సమీక్ష త్రైమాసికానికి టర్నోవరు రూ.3,761 కోట్ల నుంచి రూ.2,334 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై బోర్డు 10 శాతం (20 పైసలు) డివిడెండ్‌ను సిఫారసు చేసింది. 


Updated Date - 2020-05-30T07:42:53+05:30 IST