ఎన్‌సీసీ లాభం రూ.16 కోట్లు

ABN , First Publish Date - 2020-08-13T06:08:23+05:30 IST

జూన్‌ త్రైమాసికానికి ఎన్‌సీసీ ఏకీకృత ప్రాతిపదికన రూ.15.68 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.74.70 కోట్లతో పోలిస్తే 70 శాతం క్షీణించిందని కంపెనీ వెల్లడించింది...

ఎన్‌సీసీ లాభం రూ.16 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జూన్‌ త్రైమాసికానికి ఎన్‌సీసీ ఏకీకృత ప్రాతిపదికన రూ.15.68  కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.74.70 కోట్లతో పోలిస్తే 70 శాతం క్షీణించిందని కంపెనీ వెల్లడించింది. టర్నోవరు 44 శాతం తగ్గి రూ.2,371.51 కోట్ల నుంచి రూ.1,328.71 కోట్లకు పరిమితమైంది.  కార్యకలాపాలపై కొవిడ్‌ ప్రభావం బాగా ఉన్నందున గత ఏడాది ఇదే కాలంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికాన్ని పోల్చడానికి వీలు లేదని ఎన్‌సీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏఏవీ రంగరాజు తెలిపారు. 2020-21 మొదటి మూడు నెలల్లో రూ.2,592 కోట్ల ఆర్డర్లు లభించాయి. 

Updated Date - 2020-08-13T06:08:23+05:30 IST