Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ ఏడాది ఎన్‌సీసీ పెట్టుబడులు రూ.200 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎన్‌సీసీ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విస్తరణ, ఇతర కార్యక్రమాలపై రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఎన్‌సీసీ వైజాగ్‌ అర్బన్‌ ప్రాజెక్టు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న వారితో చర్చలు జరుగుతున్నాయని.. ముసాయిదా ఒప్పందాన్ని కూడా సిద్ధం చేశామని కంపెనీ వెల్లడించింది. వచ్చే రెండు నెలల్లో ఈ విక్రయం పూర్తి కాగలదని ఎన్‌సీసీ భావిస్తోంది. కొవిడ్‌ అనంతరం నిర్మాణ రంగం కార్యకలాపాలు క్రమంగా పుంజుకోగలవని, అదే జరిగితే 2021-22 ఏడాదిలో కంపెనీ ఆదాయంలో వృద్ధి సంతృప్తికరంగా ఉండగలదని తెలిపింది. మార్చి చివరి నాటికి ఎన్‌సీసీ చేతిలో రూ.37,911 కోట్ల విలువై పనులున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.18,943 కోట్ల ఆర్డర్లు లభించాయి. చేతిలో ఉన్న మొత్తం ఆర్డర్లలో బిల్డింగ్‌ విభాగంలోనే రూ.21,157 కోట్ల విలువైన పనులు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. 

Advertisement
Advertisement