విశాఖలో ఎన్‌సీఎల్‌ యూనిట్‌

ABN , First Publish Date - 2020-07-01T06:05:38+05:30 IST

విశాఖపట్నం సమీపంలో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ రోజుకు 2,000 టన్నుల సామర్థ్యంతో సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఇందుకు బోర్డు ఆమోదం తెలిపింది...

విశాఖలో ఎన్‌సీఎల్‌ యూనిట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : విశాఖపట్నం సమీపంలో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ రోజుకు 2,000 టన్నుల సామర్థ్యంతో సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఇందుకు బోర్డు ఆమోదం తెలిపింది.  దీంతో పాటు సూర్యాపేట జిల్లా మట్టపల్లిలోని సిమెంట్‌ యూనిట్‌ను నవీకరించనుంది. ఈ విస్తరణ, నవీకరణకు రూ.203 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. నిధుల లభ్యత తర్వాత ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.


2019-20 ఏడాదికి రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూపాయి (10శాతం) తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో గత ఏడాదికి మొత్తం 25 శాతం డివిడెండ్‌ చెల్లించినట్లవుతుంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి కంపెనీ స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన నికర లాభం రూ.26.46 కోట్ల నుంచి రూ.7.66 కోట్లకు తగ్గింది. ఆదాయం రూ.272 కోట్ల నుంచి రూ.249 కోట్లకు పరిమితమైంది. 


Updated Date - 2020-07-01T06:05:38+05:30 IST