ఐవీఆర్‌సీఎల్‌ విక్రయానికి ఎన్‌సీఎల్‌ఏటీ పచ్చజెండా

ABN , First Publish Date - 2020-05-30T07:40:34+05:30 IST

ఐవీఆర్‌సీఎల్‌ విక్రయం (లిక్విడేషన్‌)పై ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌

ఐవీఆర్‌సీఎల్‌ విక్రయానికి ఎన్‌సీఎల్‌ఏటీ పచ్చజెండా

ఐవీఆర్‌సీఎల్‌ విక్రయం (లిక్విడేషన్‌)పై ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) సమర్థించింది. ఈ మేరకు శుక్రవారం తీర్పు ఇచ్చింది. 2019 సెప్టెంబరులో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను కూడా ఎన్‌సీఎల్‌ఏటీ తొలగించింది. 2019 జులైలో ఐవీఆర్‌సీఎల్‌ను విక్రయించడానికి అనుమతి ఇస్తూ.. ఎన్‌సీఎల్‌టీ, హైదరాబాద్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. తాము దాఖలు చేసిన పరిష్కార ప్రణాళికను పరిశీలనలోకి తీసుకోకుండా పరిష్కార ప్రక్రియను చేపట్టారని, ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిందని ఫస్ట్‌ గ్లోబల్‌ ఫైనాన్స్‌ ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది.

Updated Date - 2020-05-30T07:40:34+05:30 IST