Abn logo
Sep 21 2021 @ 17:23PM

Canada లో మళ్లీ మనోడే కింగ్‌మేకర్..

ఒట్టావా: కెనడా ఎన్నికల ఫలితాల్లో ప్రధాని జస్టీన్ ట్రూడో నేతృత్వంలోని అధికార లిబరల్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించడంలో విఫలమైంది. మొత్తం 338 సీట్లు ఉన్న హైస్ ఆఫ్ కామన్స్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 170 సీట్లు కావాలి. కానీ, ట్రూడో పార్టీ 156 సీట్లకే పరిమితమైంది. దీంతో ట్రూడోకు మరోసారి పగ్గాలు చేపట్టేందుకు 14 సీట్లు కావాలి. అటు జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ(ఎన్‌డీసీ) ఏకంగా 27 సీట్లు గెలిచింది. 2017 కంటే ఈసారి 3 సీట్లు అధికంగా గెలవడం విశేషం. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కన్జర్వేటివ్ పార్టీ 122 సీట్లు మాత్రమే సాధించింది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు న్యూ డెమొక్రటిక్ పార్టీ అధినేత జగ్మీత్ సింగ్‌పై ఉంది. ఎందుకంటే ట్రూడో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మళ్లీ జగ్మీత్ సాయం తీసుకోవాల్సిందే. 2017 మాదిరిగానే ఈసారి కూడా అదే మ్యాజిక్ రీపిట్ కావడంతో మనోడే కింగ్‌మేకర్‌గా మారారు. 


ఇవి కూడా చదవండి..

Canada Polls 2021: ఎన్నారైలదే హవా.. ఈసారి ఎన్నికల బరిలో ఎంతమంది ఉన్నారంటే..

భారతీయులకు గుడ్‌న్యూస్.. బైడెన్ సర్కారు కీలక నిర్ణయం..


ఇక ఈసారి ఎన్నికల్లో మొత్తం 47 మంది భారత సంతతి అభ్యర్థులు బరిలో నిలిస్తే.. 17 మంది విజయం సాధించారు. వీరిలో జగ్మీత్ సింగ్, మాజీ మంత్రి టిమ్ ఉప్పల్, ప్రస్తుత ముగ్గురు కేబినేట్ మంత్రులు హర్జీత్ సింగ్ సజ్జన్, బర్దీష్ చగ్గర్, అనిత ఆనంద్ ఉన్నారు. డిఫెన్స్ మినిస్టర్ అయిన హర్జీత్ సింగ్ సజ్జన్ వాంకోవర్ సౌత్ నుంచి సుఖ్బీర్ గిల్(కన్జర్వేటివ్ పార్టీ)పై విజయం సాధించారు. అలాగే వాటర్లూ నుంచి చగ్గర్, ఓక్‌విల్లే నుంచి ఆనంద్ గెలిచారు. ఎన్‌డీసీ అధినేత జగ్మీత్ మరోసారి బ్రిటిష్ కొలంబియాలోని బర్న్‌బే సౌత్ సీటును నిలుపుకున్నారు.     


ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...