హ్యాకర్ల చేతిలో 2.9 కోట్ల మంది నిరుద్యోగుల డేటా..!

ABN , First Publish Date - 2020-05-24T02:49:43+05:30 IST

దేశంలోని 2.9 కోట్ల మంది నిరుద్యోగులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో లభిస్తున్నట్లు...

హ్యాకర్ల చేతిలో 2.9 కోట్ల మంది నిరుద్యోగుల డేటా..!

న్యూఢిల్లీ: దేశంలోని 2.9 కోట్ల మంది నిరుద్యోగులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో లభిస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ ఇంటలిజెన్స్ సంస్థ సైబల్ పేర్కొంది. ఈ సమాచారాన్ని ప్రజల నుంచి హ్యాకర్లు దొంగిలించి డార్క్ వెబ్‌లో పెట్టారని, అక్కడ ఈ సమాచారం ఉచితంగా లభిస్తోందని సైబల్ తెలిపింది. ఇందులో నిరుద్యోగుల చదువుకు సంబంధించిన వివరాలు, వారి చిరునామా తదితర ముఖ్యమైన వివరాలన్నీ ఉన్నాయని వివరించింది. ఈ సమాచారం అంతా ఓ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా హ్యాకర్ల చేతికి చిక్కినట్లు తెలుస్తోందని, ఆ వెబ్‌సైట్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారందరి వివరాలు ఇప్పుడు డార్క్ వెబ్‌లో ప్రత్యక్షమయ్యాయని వెల్లడిచింది.

Updated Date - 2020-05-24T02:49:43+05:30 IST