భారత్‌కు వచ్చేస్తాం.. విమానం పంపండి

ABN , First Publish Date - 2020-03-30T15:02:43+05:30 IST

ప్రపంచ దేశాలకు కరోనా కంటి మీద కునుకు లేకుం డా చేస్తోంది. ఆర్థిక వ్యవస్థతో పా టు అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయంగానూ సమస్యలు సృష్టిస్తోంది. ఆది

భారత్‌కు వచ్చేస్తాం.. విమానం పంపండి

  • స్పెయిన్‌లో కరోనా మరణ మృదంగం
  • ప్రపంచవ్యాప్తంగా 33 వేలు దాటిన మృతులు
  • ఏడు లక్షలను మించిన పాజిటివ్‌ కేసులు
  • న్యూజిలాండ్‌లో వైరస్‌తో తొలి మరణం
  • కరోనా సంక్షోభంతో జర్మనీలో మంత్రి ఆత్మహత్య
  • కోలుకున్న కెనడా ప్రధాని భార్య
  • అమెరికాలో లక్షమంది చనిపోవచ్చు: ఆంథోని ఫాసీ
  • బంగ్లా వీధుల్లో సైన్యంతో పర్యవేక్షణ
  • అఫ్గాన్‌లో భారత దౌత్య సిబ్బంది తరలింపు


మాడ్రిడ్‌, రోమ్‌, న్యూయార్క్‌, మార్చి 29: ప్రపంచ దేశాలకు కరోనా కంటి మీద కునుకు లేకుం డా చేస్తోంది. ఆర్థిక వ్యవస్థతో పా టు అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయంగానూ సమస్యలు సృష్టిస్తోంది. ఆదివారంతో ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ మృతుల సంఖ్య 33 వేలు దాటింది. పాజిటివ్‌ కేసులు 7 లక్షలను మించాయి. ఒక్క రో జులో తమ దేశంలో 838 మంది చనిపోయారంటూ స్పెయిన్‌ ప్రకటించింది. ఇటలీలోనూ తాజా మరణాలూ(756) భారీగానే ఉన్నాయి. న్యూజిలాండ్‌లో కొవిడ్‌తో తొలి మరణం సంభవించింది. కరోనా సంక్షోభంతో తీవ్రంగా కలత చెందిన జర్మనీలోని హె స్సె రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్‌ షెఫర్‌(54) ఆత్మహ త్య చేసుకున్నారు. జర్మనీ ఆర్థిక రాజధాని, ప్రముఖ బ్యాంకులు, సంస్థలకు నెలవైన ఫ్రాంక్‌ఫర్ట్‌.. హెస్సె రాష్ట్రంలోనే ఉంది. తాజా పరిణామాలతో షెఫర్‌ ఆం దోళనకు గురయ్యారు. వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కెనడా ప్రధాని ట్రూడో భార్య సోఫి గ్రెగరీ తెలిపారు. 


న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌లను క్వారంటైన్‌  చేయాలన్న ప్రతిపాదనపై గవర్నర్ల నుంచి వ్యతిరేకత రావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెనక్కుతగ్గారు. జాగ్రత్తలు పాటించకుం టే అమెరికాలో కరోనాతో ల క్ష మంది వరకు చనిపోవచ్చని ఇన్ఫెక్షన్‌ వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంథోని ఫాసీ హెచ్చరించారు. ఇరాన్‌లో రోజుకు 100 మందికి తగ్గకుండా చనిపోతున్నారు. ఆ దివారం 123 మంది ప్రాణా లు కోల్పోయారు. అఫ్గానిస్థాన్‌లోనూ వైరస్‌ విస్తరిస్తోంది. దీంతో హెరాట్‌, జలాలాబాద్‌లోని దౌత్యవేత్తలు, సిబ్బందిని భారత్‌ కాబూల్‌కు తరలించింది. వైద్య వీసాలపై వచ్చిన ఐదుగురు పాక్‌ దేశీయులను వాఘా మీదుగా భారత్‌ వారి దేశానికి పంపింది. పాకిస్థాన్‌లో  13 మంది మృతి చెందారు.  సామాజిక దూరం అమలుకు బంగ్లాదేశ్‌ సైన్యాన్ని మోహరిస్తోంది.


కరోనా నేపథ్యంలో అమెరికావ్యాప్తంగా ఉన్న వై ద్య కళాశాలలు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 3 నెలల ముందుగానే పట్టాల ప్రదానానికి సిద్ధమయ్యా యి. వందలమంది సేవలను వినియోగించుకోనున్నారు. కరోనాతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్న బ్రిటన్‌ ప్రదాని బోరిస్‌ జాన్స న్‌.. ఆదివారం తమ పౌరులనుద్దేశించి లేఖ రాశారు. పరిస్థితులు అధ్వానంగా మారకమునుపే చక్కదిద్దుదామని.. ప్రజల ప్రాణాలను కాపాడటంలో అందరి సహకారం కావాలని అన్నారు.


వచ్చేస్తాం.. విమానం పంపండి

యూకేలో విద్యాభ్యాసం చేస్తూ.. అంతర్జాతీయ విమానాల రద్దుతో భారత్‌కు తిరిగి రాలేకపోతున్న 380 మంది విద్యార్థులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. తమ కో సం ప్రత్యేక విమా నం పంపాలని అందులో కోరారు. ఈ విద్యార్థుల్లో ఎక్కువమంది కేరళకు చెందినవారు. వారంతా మెరైన్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నారు.


కరోనాతో అమెరికాలో నవజాత శిశువు మృతి

అమెరికాలోని ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌గా తేలి.. చికిత్స పొందుతున్న నవజాత శిశువు చనిపోయింది. దేశంలో ఏడాదిలోపు వయసున్న పిల్లల్లో.. కొవిడ్‌ కారణంగా మృతిచెందడం ఇదే తొలిసారి. దీనిపై స్థానిక వైద్యాధికారులు విచారణ ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో వైరస్‌ క్రమంగా ప్రతాపం చూపుతోంది.

Updated Date - 2020-03-30T15:02:43+05:30 IST