యూఏఈలోని భారతీయుల గురించి ఆసక్తికర విషయం బయటపెట్టిన హెచ్‌ఎస్‌బీసీ నివేదిక

ABN , First Publish Date - 2021-11-18T15:26:41+05:30 IST

యూఏఈలో నివసిస్తున్న భారతీయులు ఆ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే ఈ ప్రశ్నకు ఈ బ్రిటన్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ (హెచ్ఎస్‌బీసీ) అవుననే సమాధానం

యూఏఈలోని భారతీయుల గురించి ఆసక్తికర విషయం బయటపెట్టిన హెచ్‌ఎస్‌బీసీ నివేదిక

ఎన్నారై డెస్క్: యూఏఈలో నివసిస్తున్న భారతీయులు ఆ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే ఈ ప్రశ్నకు ఈ బ్రిటన్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ (హెచ్ఎస్‌బీసీ) అవుననే సమాధానం చెబుతోంది. హెచ్‌ఎస్‌బీసీ సర్వే నిర్వహించి తాజాగా గ్లోబల్ ఇండియన్ పల్స్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం.. యూఏఈలో నివసిస్తున్న 66 శాతం మంది భారతీయులు రాబోయే మూడేళ్లలో దేశంలో తమ పెట్టుబడులను పెంచుకోవాలని యోచిస్తున్నారు. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, ప్రైవేటు బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయులు ఆసక్తి చూపిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. 



ఈ సందర్భంగా హెచ్‌ఎస్‌బీసీ యూఏఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అబ్దుల్ఫత్తా షరాఫ్ మాట్లాడుతూ.. యూఏఈలో అత్యధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక్కడ సుమారు 3.5 మిలియన్ల మంది భారతీయులు ఉన్నట్టు వెల్లడించారు. భారతదేశం ఇప్పటికే యూఏఈ యొక్క రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది అన్నారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి కొనసాగుతున్నందున ఇక్కడ ఉన్న భారతీయ పారిశ్రామికవేత్తలు, వ్యాపారాల ఆశయాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే.. హెచ్‌ఎస్‌బీసీ ఈ సర్వేను ఆగస్ట్ 18-సెప్టెంబర్ 13 మధ్య నిర్వహించగా ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 4,152 మంది భారతీయుల పాల్గొని తమ అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. 


Updated Date - 2021-11-18T15:26:41+05:30 IST