ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష

ABN , First Publish Date - 2021-09-12T00:04:05+05:30 IST

దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను ఆదివారం నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పరీక్ష నిర్వహిస్తారు....

ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష

 హైదరాబాద్: దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను  ఆదివారం నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులంతా మ‌ధ్యాహ్నం 1.30 వ‌ర‌కు సెంట‌ర్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని తెలిపారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు 16 లక్షల మంది విద్యార్థులు హజరుకానున్నారు.




తెలుగు రాష్ట్రాల నుండి నీట్  పరీక్షకు  ల‌క్ష మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మొత్తం 202 ప‌ట్టణాల్లో 3,842 ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.తెలంగాణ‌లో 7 పట్టణాల్లో 112 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీలో 9 సిటీల్లో 151 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప‌రీక్షా కేంద్రంలోకి అడ్మిట్ కార్డు, ఫొటో, ఐడెంటిటీ కార్డుతో పాటు చిన్న శానిటైజ‌ర్ బాటిల్‌కు మాత్రమే అనుమ‌తిస్తామన్నారు. విద్యార్ధులు మాస్కు త‌ప్ప‌నిస‌రిగా ధరించాలని, లేత రంగు దుస్తులు మాత్రమే ధరించాలని అధికారులు సూచించారు.

Updated Date - 2021-09-12T00:04:05+05:30 IST