మెరుగైన వైద్యసేవలందించాలి

ABN , First Publish Date - 2021-05-17T06:14:14+05:30 IST

మండల పరిధిలోని తరిమెల గ్రామంలో ఉన్న పీహెచసీలో డి ప్యుటేషన మీద పంపిన వైద్య సిబ్బందిని వెంటనే రప్పించి ప్రజలకు మెరుగైన వైద్యసేవ లందించేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

మెరుగైన వైద్యసేవలందించాలి
ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు



ప్లకార్డులతో సీపీఎం నాయకుల నిరసన

శింగనమల, మే16 : మండల పరిధిలోని తరిమెల గ్రామంలో ఉన్న పీహెచసీలో డి ప్యుటేషన మీద పంపిన వైద్య సిబ్బందిని వెంటనే రప్పించి ప్రజలకు మెరుగైన వైద్యసేవ లందించేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆది వారం పీహెచసీ ఎదురుగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగరాజు, మండల కార్యదర్శి భాస్కర్‌, గ్రామ కార్యదర్శి గిరి ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.... ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత తక్కువగా ఉందని... వెంటనే తగిన సిబ్బందిని నియమించి 24 గంటలూ వైద్యం అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, రాజశేఖర్‌శెట్టి, చంద్రమౌళి, యుగంధర్‌, రంగస్వామి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 కరోనా నివారణలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా

 నేడు సీపీఐ ధర్నా

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 16: కరోనా నివారణ, బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించండంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా సోమవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు తెలిపారు. కొవిడ్‌ నిబంధన లకు అనుగుణంగా ఉదయం 11గంటలకు ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల వైఫల్యానికి నిరసనగా ధర్నా నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2021-05-17T06:14:14+05:30 IST