ఆయుధాలపై అవగాహన అవసరం: డీఐజీ

ABN , First Publish Date - 2021-10-27T06:19:03+05:30 IST

పోలీసు ఆయుధాలపై అవగాహన కలిగి ఉండాలని అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణా టాటా, ఎస్పీ డాక్టర్‌ కాగినెల్లి ఫక్కీరప్ప విద్యార్థులకు సూచించారు.

ఆయుధాలపై అవగాహన అవసరం: డీఐజీ
ఆయుధాల గురించి విద్యార్థులకు వివరిస్తున్న డీఐజీ, ఎస్పీ


అనంతపురం క్రైం, అక్టోబరు 26: పోలీసు ఆయుధాలపై అవగాహన కలిగి ఉండాలని అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణా టాటా, ఎస్పీ డాక్టర్‌ కాగినెల్లి ఫక్కీరప్ప విద్యార్థులకు సూచించారు. పోలీసు అమ రవీరుల వారోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఓపెన హౌస్‌ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు.  పోలీసులు విధి నిర్వాహణలో వినియోగించే ఆయుధాలు, పరికరాలు, తదితర వాటిని ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన క ల్పించారు. పోలీసు అమర వీరుల వారోత్సవాల నేపథ్యంలో ఏటా పో లీసు ఆయుధాల ప్రదర్శన చేసి అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు.  కార్యక్రమంలో అదనపు ఎ స్పీ నాగేంద్రుడు, ఓఎస్డీ రామకృష్ణప్రసాద్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ హనుమంతు, పలువురు ఆర్‌ఐలు, జిల్లా పోలీసు అధికారుల అడహక్‌ కమిటీ సభ్యులు త్రిలోక్‌నాథ్‌, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-10-27T06:19:03+05:30 IST