హెయిర్ కటింగ్ చేయించుకోవాలంటే ఆధార్‌కార్డు, మొబైల్ ఫోన్ నంబరు తప్పనిసరి

ABN , First Publish Date - 2020-06-02T16:27:33+05:30 IST

కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో మీరు హెయిర్ కటింగ్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఆగండి...మీ ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నంబరు తప్పనిసరి....

హెయిర్ కటింగ్ చేయించుకోవాలంటే ఆధార్‌కార్డు, మొబైల్ ఫోన్ నంబరు తప్పనిసరి

తమిళనాడు సర్కారు ఉత్తర్వులు

చెన్నై(తమిళనాడు): కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో మీరు హెయిర్ కటింగ్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఆగండి...మీ ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నంబరు తప్పనిసరి వెంట తీసుకురావాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది. ఈ మేర హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు, స్పాలకు మార్గదర్శకాలను సర్కారు విడుదల చేసింది. కొవిడ్ -19 ప్రబలుతున్న నేపథ్యంలో హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు, స్పాలకు వచ్చే ఖాతాదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లను తీసుకోవాలని సర్కారు ఆదేశించింది. గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, కమిషనర్లకు ఏడు పేజీల సూచనలతో కూడిన ఆదేశాలను సర్కారు విడుదల చేసింది. హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్ల ప్రవేశద్వారాల్లో హ్యాండ్ శానిటైజరు, సబ్బు, నీళ్లు అందుబాటులో ఉంచాలని సర్కారు సూచించింది. ఖాతాదారులు అప్పాయింట్ మెంట్ తీసుకొని భౌతిక దూరం పాటిస్తూ హెయిర్ కటింగులు చేయించుకోవాలని సర్కారు సూచించింది. హెయిర్ కటింగు సెలూన్లలో ఏసీలు, ఎయిర్ కూలర్లు వాడరాదని, కిటికీలు తెరచి ఉంచాలని, వాడిన బ్లేడ్లను మళ్లీ వాడరాదని, హెడ్ బాండ్స్, టవల్స్ ఒకరికి మాత్రమే వాడాలని సర్కారు ఆదేశించింది. హెయిర్ కటింగ్ చేసే కార్మికులు చేతులకు హ్యాండ్ గ్లోజులు , ఫేస్ మాస్క్ లు ధరించాలని సర్కారు కోరింది. హెయిర్ కటింగుకు వచ్చే వారికి దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారిని లోపలకు అనుమతించవద్దని సర్కారు తన మార్గదర్శకాల్లో ఆదేశించింది. 

Updated Date - 2020-06-02T16:27:33+05:30 IST