చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2021-10-24T05:09:22+05:30 IST

చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి

చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి
పోమాల్‌పల్లి గ్రామస్తులతో న్యాయవాదులు

కందుకూరు/కేశంపేట: చట్టాలపై ప్రజలు ఆవగాహన కలిగి ఉండాలని మహేశ్వరం 27వ అదనపు మెట్రోపాలిట్‌  జడ్జి ఫర్హీన్‌ కౌసర్‌ అన్నారు. శనివారం ఆకులమైలారంలో సీఐ కృష్ణంరాజుతో కలిసి నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. ఏదైనా సమ స్య గ్రామంలో పరిష్కారం కాకుంటే మొదట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. నేర రహిత సమాజ నిర్మాణానికి చట్టాలపై అవగాహన సద స్సులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కళమ్మ, ఎంపీటీసీ పద్మపాండు, లాయర్లు రాంచదర్‌రావు, కిషన్‌గౌడ్‌, సుభాష్‌, అశోక్‌ పాల్గొన్నారు. కేశంపేట మండలం దేవునిగుడి తండా పోమాల్‌పల్లి, కొండారెడ్డిపల్లిల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. న్యాయవాదులు నారేంద్రనాథ్‌, ఆంజనేయులు, నాగరాజు, రామచంద్రయ్య, శ్రీశైలం చట్టాలు, న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సహాయం అందించేందుకు మండల స్థాయిలో సేవాధికార సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. బాల కార్మిక, సీనియర్‌ సిటిజన్‌, జువైనల్‌, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో పోమాల్‌పల్లి సర్పంచ్‌కృష్ణయ్య, ఉపసర్పంచ్‌లు అనుమగళ్ల రమేష్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T05:09:22+05:30 IST