ముందస్తు ఎన్నికలకు సన్నద్ధం కావాలి

ABN , First Publish Date - 2022-01-17T07:04:40+05:30 IST

ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణు లు సన్నద్ధం కావాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

ముందస్తు ఎన్నికలకు  సన్నద్ధం కావాలి
చిలుకూరులో మాట్లాడుతున్న ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ, జనవరి 16: ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణు లు సన్నద్ధం కావాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.  ఆదివారం పట్టణంలోని పబ్లిక్‌ క్లబ్‌లో ఏర్పాటుచేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్‌ తలకిందులుగా తపస్సు చేసిన 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవదన్నారు. కల్వకుంట్ల కుటుంబంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు.  వరికి మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం  ఇవ్వకపోవటంతో ఎకరాకు రూ12 వేలను రైతులు నష్టపోతున్నారని,  రైతుబంధు పేరుతో ఎకరాకు రూ.5 వేలు ఇస్తున్నారని. ఈ క్రమంలో  రూ.7వేలు నష్టపోతున్నందుకు రైతులు సంబరాలు చేసుకోవాలా? అని ప్రశ్నించారు. ఐదు సార్లు ఎన్నికల్లో  గెలిచినా హైదరాబాద్‌, నల్లగొండ, హుజూర్‌నగర్‌లో తనకు సొంత ఇల్లు లేద న్నారు.  ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన అధికార పార్టీ నాయకులు కోట్ల రూపాయలతో ఇళ్లను నిర్మించారని, డబ్బులు ఎక్కడివో చెప్పా లని నిలదీశారు.ుఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావు, అర్జున్‌, పాల్గొన్నారు

పార్టీ సభ్యత్వాలను వేగవంతం చేయాలి

మోతె: కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని సర్వారంలో నిర్వ హించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదును రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాను ముందు వరుసలో ఉంచాలన్నారు. అనంతరం రాఘవాపురం గ్రామానికి చెందిన ఏనుగ శ్రీనివాస్‌రెడ్డి సభ్యత్వ నమోదును వేగవంతం చేయడంతో శాలు వాతో సన్మానించారు. ఇటీవల మరణించిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఉర్లుగొండలో ఘనంగా స్వాగతం పలికారు. 

కేసీఆర్‌ను  గద్దె దించడం ఖాయం: ఎంపీ

చిలుకూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీ ఆర్‌ను  ప్రజలు  గద్దె దించడం ఖాయమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదుపై మండల కేం ద్రంలో  నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో పార్టీ  మండల అధ్యక్షుడు  వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.







Updated Date - 2022-01-17T07:04:40+05:30 IST