యోగ్యమైన పాలన కావాలి, యోగీ పాలన కాదు: అఖిలేష్

ABN , First Publish Date - 2021-11-14T00:38:11+05:30 IST

కంప్యూటర్, మొబైల్ ఫోన్ ఆపరేట్ చేయరాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్లీ ఆయన ల్యాప్‌ట్యాప్, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ నేతల సామాజిక, సాంకేతిక జ్ణానం ఏంటో ప్రజలకు తెలుసు. వాళ్లు చెప్పే విషయాలు ప్రజలు నమ్మరు

యోగ్యమైన పాలన కావాలి, యోగీ పాలన కాదు: అఖిలేష్

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌కు కావాల్సింది యోగ్యమైన పాలనని, యోగీ పాలన కాదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అజాంగఢ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అఖిలేష్ పాల్గొని ప్రసంగించారు.


‘‘కంప్యూటర్, మొబైల్ ఫోన్ ఆపరేట్ చేయరాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్లీ ఆయన ల్యాప్‌ట్యాప్, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ నేతల సామాజిక, సాంకేతిక జ్ణానం ఏంటో ప్రజలకు తెలుసు. వాళ్లు చెప్పే విషయాలు ప్రజలు నమ్మరు’’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు. అజాంగఢ్‌లో ఈరోజు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై అఖిలేష్ స్పందిస్తూ ‘‘భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పాలన చేయలేదు. విధ్వంసకర పాలన చేస్తోంది. ప్రజలను మోసం చేసింది. ఆజంగఢ్‌ను ఎవరైనా అవమానించారంటే అది బీజేపీనే. అజాంగఢ్‌కు చెందిన ఒక వ్యాపారిని బీజేపీ నేతలు చంపారు. అలా అజాంగఢ్‌కు చెడ్డపేరు తెచ్చారు. ఈ కేసులో సీఎం పేరు కూడా ఉంది’’ అని అన్నారు.

Updated Date - 2021-11-14T00:38:11+05:30 IST