Advertisement

పెళ్లైన మగాడితో ప్రేమలో పడితే.. Neena Gupta ఆసక్తికర పోస్ట్!

పెళ్లైన మగాడితో ప్రేమలో పడిన మహిళ మస్కారా వేసుకోకూడదని, ఆమె ఎప్పుడూ కన్నీళ్లతోనే ఉంటుందని బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా పేర్కొంది. తాజాగా ఓ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో షేర్ చేసింది. అందులో పెళ్లైన మగాడితో ప్రేమలో పడడం గురించి మాట్లాడింది. `మీరు పెళ్లైన మగాడితో ప్రేమలో పడితే ఎప్పుడూ మస్కారా వేసుకోకండి. నేనేం చెబుతున్నానో మీకర్థమవుతోందా? నేను ఎందుకు ఇలా చెబుతున్నానో మీరు అనుభవిస్తేనే తప్ప తెలియద`ని వ్యాఖ్యానించింది. 


గతంలో కూడా నీనా ఇలాంటి వీడియోనే షేర్ చేసింది. `పెళ్లైన మగాడు మీ కోసం తన భార్యను వదలుకుంటానంటాడు. కానీ, పిల్లల కోసం ఆమెను భరిస్తానంటాడు. మీతో గడిపేందుకు కుటుంబంతో అబద్ధం చెబుతాడు. పెళ్లి చేసుకోమని అడిగితే.. బ్యాంకు లావాదేవీలు, ఆస్తి వ్యవహారాలు అని అబద్ధాలు చెబుతాడు. గట్టిగా అడిగితే మిమ్మల్ని సులభంగా వదిలించుకుంటాడు. గతంలో నాకు ఇది ఎదురైంది కాబట్టి మీకు చెబుతున్నాన`ని నీనా ఆ వీడియోలో పేర్కొంది. వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో ప్రేమలో పడిన నీనా.. పెళ్లి కాకుండానే ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 

Advertisement

Bollywoodమరిన్ని...