తొలిసారి విమానమెక్కిన నీరజ్ చోప్రా తల్లిదండ్రులు

ABN , First Publish Date - 2021-09-11T23:33:07+05:30 IST

ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర స‌ృష్టించిన నీరజ్ చోప్రా ‘జీవితంలో ఒక కల నెరవేరిం’దంటూ ట్వీట్ చేశారు. ఆయన చెప్పింది విశ్వ క్రీడా వేదికపై సాధించిన అద్భుత విజయం గురించి కాదు. ఒక కొడుకుగా తన తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసినందుకు గర్వపడుతూ నీరజ్ తాజా ట్వీట్ ను అభిమానులతో పంచుకున్నాడు.

తొలిసారి విమానమెక్కిన నీరజ్ చోప్రా తల్లిదండ్రులు

ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర స‌ృష్టించిన నీరజ్ చోప్రా ‘జీవితంలో ఒక కల నెరవేరిం’దంటూ ట్వీట్ చేశారు. ఆయన చెప్పింది విశ్వ క్రీడా వేదికపై సాధించిన అద్భుత విజయం గురించి కాదు. ఒక కొడుకుగా తన తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసినందుకు గర్వపడుతూ నీరజ్ తాజా ట్వీట్ ను అభిమానులతో పంచుకున్నాడు. 

జావెలిన్ త్రోలో దేశానికి స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా తన తల్లిదండ్రుల్ని తొలిసారి విమానం ఎక్కించారు. వారితో కలసి ఫ్లైట్ మెట్లపై ఉన్న ఫోటోని, విమానంలోపలి చిత్రాన్ని సొషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే, ఆ పిక్స్ తో పాటూ ‘జీవితంలో ఒక చిన్న కల నెరవేరింది. అమ్మని, నాన్నని తొలిసారి విమానంలో కూర్చోబెట్టగలిగాను‘ అంటూ ఆనందం వ్యక్తం చేశారు చోప్రా.

నీరజ్ చోప్రా పేరు, టోక్యో ఒలంపిక్స్ లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం సాధించాక... దేశమంతటా మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఆయన పేరుని పూణేలోని ఒక స్టేడియంకి కూడా ఇండియన్ ఆర్మీ అధికారులు పెట్టటం జరిగింది. తనకు దక్కిన గౌరవానికి సంతోషం వ్యక్తం చేసిన ఒలంపిక్ ఛాంపియన్ మరెందరో ప్రేరణ పొందాలని అక్షాంకించారు. మరింత మంది క్రీడల వైపు ఆకర్షితులు కావాలని అన్నారు.   

Updated Date - 2021-09-11T23:33:07+05:30 IST