‘నీట్‌’ భయానికి మరో విద్యార్థిని బలి

ABN , First Publish Date - 2022-07-17T16:44:13+05:30 IST

రాష్ట్రంలో ఆదివారం ‘నీట్‌’ జరుగను న్న నేపథ్యంలో, ఈ పరీక్ష కఠినతరంగా ఉంటుందని లేఖ రాసి అరియలూరులో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న

‘నీట్‌’ భయానికి మరో విద్యార్థిని బలి

ప్యారీస్‌(చెన్నై), జూలై 15: రాష్ట్రంలో ఆదివారం ‘నీట్‌’ జరుగనున్న నేపథ్యంలో, ఈ పరీక్ష కఠినతరంగా ఉంటుందని లేఖ రాసి అరియలూరులో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. అరియలూరు రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్న నటరాజన్‌-ఉమ దంపతుల కుమార్తె నిషాంతి గత సంవత్సరం జరిగిన ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షల్లో 529 మార్కులు తెచ్చుకుంది. అదే ఏడాది నీట్‌ రాసినా ఆమెకు సీటు రాలేదు. రెండోసారి పరీక్ష రాసేందుకు తిరుచ్చిలోని ఓ ప్రైవేటు అకాడమీలో శిక్షణ కూడా పొందింది. ఇదిలా ఉండగా, ఈసారి కూడా నీట్‌ ప్రశ్నలు కఠినంగా ఉం టాయనే భయంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి, వంట గదిలో ఉరేసుకొని మృతిచెందింది. అరియలూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-07-17T16:44:13+05:30 IST