నీట్‌ పీజీ 2021 కటాఫ్‌ మార్కుల తగ్గింపు

ABN , First Publish Date - 2022-03-13T07:56:28+05:30 IST

రెండు విడతల కౌన్సిలింగ్‌ పూర్తయిన తర్వాత కూడా ఖాళీగా మిగిలిన మెడిసిన్‌ పోస్టుగ్రాడ్యుయేషన్‌ సీట్ల ..

నీట్‌ పీజీ 2021  కటాఫ్‌ మార్కుల తగ్గింపు

మెడిసిన్‌ పీజీ అన్ని కేటగిరీల్లోనూ 

15ు తగ్గించాలని నిర్ణయం

నీట్‌ పీజీ 2021 కటాఫ్‌ మార్కుల తగ్గింపు

న్యూఢిల్లీ, మార్చి 12: రెండు విడతల కౌన్సిలింగ్‌ పూర్తయిన తర్వాత కూడా ఖాళీగా మిగిలిన మెడిసిన్‌ పోస్టుగ్రాడ్యుయేషన్‌ సీట్ల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ.. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎన్‌బీఈ)ను ఆదేశించింది. నీట్‌ (ఎన్‌ఈఈటీ) పీజీ 2021 కట్‌ ఆఫ్‌ మార్కులను అన్ని కేటగిరీలకు 15ు వరకు తగ్గించాలని సూచించింది. దేశవ్యాప్తంగా రెండు విడతల కౌన్సిలింగ్‌ ముగిసేనాటికి దాదాపు 8 వేల సీట్లు ఖాళీగా మిగిలిపోయాయని, వీటిని భర్తీ చేసే విషయంపై మెడికల్‌ కౌన్సిల్‌తో చర్చించిన తర్వాత ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. దీని ప్రకారం జనరల్‌ కేటగిరీ అభ్యర్థుల్లో 35 శాతం మార్కులు, జనరల్‌ దివ్యాంగులకు 30 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల్లో 25 శాతం మార్కులు వచ్చిన వారిని తదుపరి కౌన్సిలింగ్‌కు అనుమతించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సవరించిన నీట్‌ పీజీ ఫలితాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. దీని ద్వారా.. ఈ 8 వేల సీట్లకు అన్ని కేటగిరీలకు కలిపి దాదాపు 25 వేల మంది అభ్యర్థులు కౌన్సిలింగ్‌కు అర్హత సాధిస్తారని చెప్పారు. 

Updated Date - 2022-03-13T07:56:28+05:30 IST