యోగీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. యూపీకి వెళ్లాలంటే ఆ రిపోర్టు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-07-19T00:29:16+05:30 IST

రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివిటీ రేటు 3 శాతం కన్నా అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి యూపీకి రావాలనుకునే వారు తమకు కరోనా లేదని చెప్పే ఆర్‌టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

యోగీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. యూపీకి వెళ్లాలంటే ఆ రిపోర్టు తప్పనిసరి

లఖ్‌నవూ: రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివిటీ రేటు 3 శాతం కన్నా అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి యూపీకి రావాలనుకునే వారు తమకు కరోనా లేదని చెప్పే ఆర్‌టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. యూపీకి వచ్చిన రోజుకు నాలుగు రోజుల ముందు జారీ అయిన రిపోర్టులు ఉన్న వ్యక్తులను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించాలంటూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రోడ్డు, రైలు, విమానాల్లో యూపీకి వచ్చే వారందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే..ఈ కొత్త మార్గదర్శకాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీకా రెండు డోసులు తీసుకున్న వారి విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏమిటనే దానిపై కొంత అస్పష్టత నెలకొంది. ఆదివారం నాడు అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడి కోసం టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కూడా అధికారులను సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు.

Updated Date - 2021-07-19T00:29:16+05:30 IST