శ్రద్దాంజలి ఫ్లెక్సీలో నెగిటివ్ రిపోర్టు

ABN , First Publish Date - 2020-04-05T17:59:06+05:30 IST

నగరంలో నవాబ్ పేటకు చెందిన స్వీట్, సమోసా వ్యాపారి షేక్ మునీర్ అనారోగ్యంతో మృతి చెందారు.

శ్రద్దాంజలి ఫ్లెక్సీలో నెగిటివ్ రిపోర్టు

చీరాల: నగరంలో నవాబ్ పేటకు చెందిన స్వీట్, సమోసా వ్యాపారి షేక్ మునీర్ అనారోగ్యంతో మృతి చెందారు. మునీర్ భాయిగా ప్రకాశం జిల్లాలో పేరొందిన ఆయన కిడ్నీలు పాడవడంతో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో వారం క్రితం చేరారు. చికిత్స పొందుతూ ప్రాణం విడిచారు. అతనికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తే నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఇదే విషయాన్ని శ్రద్దాంజలి ప్లెక్సీలో ప్రస్తావించారు. కరోనా విజృంభన కారణంగా ఎవరూ అపోహ చెందకుండా ఉండేందుకు ప్లెక్సీలో ఏ వ్యాధి కారణంగా చనిపోయిందో రాయాల్సి వచ్చిందని మునీర్ తనయుడు చెప్పారు.

Updated Date - 2020-04-05T17:59:06+05:30 IST