ఆక్సిజన సరఫరాలో నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2021-05-05T05:25:16+05:30 IST

కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాదితులకు ఆక్సిజన సరఫరాలో ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే దానిని పునరుద్దరించాలని ఆక్సిజన సరఫరాపై నిరంతరం నిఘా పెట్టాలంటూ జాయింట్‌ కలెక్టర్‌ నిషాంతకుమార్‌ వైద్యులకు ఆదేశించారు.

ఆక్సిజన సరఫరాలో నిర్లక్ష్యం తగదు
వైద్యులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌

- కొవిడ్‌ ఆసుపత్రిని  తనిఖీ చేసిన జాయింట్‌ కలెక్టర్‌

హిందూపురం టౌన, మే 4: కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాదితులకు ఆక్సిజన సరఫరాలో ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే దానిని పునరుద్దరించాలని ఆక్సిజన సరఫరాపై నిరంతరం నిఘా పెట్టాలంటూ జాయింట్‌ కలెక్టర్‌ నిషాంతకుమార్‌ వైద్యులకు ఆదేశించారు. సోమవారం హిందూపురం ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రిలో ఆక్సిజన అందక కొవిడ్‌ బాధితులు మృతిచెందిన సంఘటనపై మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న జాయింట్‌ కలెక్టర్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ వివరాలు ఆరాతీశారు. రోగులు చనిపోవడానికి గల కారణాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ కొవిడ్‌ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. ఆసుపత్రి మానిటరింగ్‌ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. ఏ ఒక్కరు కూడా ఆక్సిజన అందక చనిపోవడానికి  వీలులేదన్నారు. దీంతోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదితులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. వీరి వెంట డీఎ్‌సపీ మహబూబ్‌బాష, డిప్యూటీ డీఎంహెచఓ శ్రీనివాసరెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, సూపరింటెండెంట్‌ దివాకర్‌బాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇలా ఉంటే సోమవారం కొవిడ్‌ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-05-05T05:25:16+05:30 IST